నెగిటివ్ షేడ్స్ ఉన్న మహారాణి పాత్రలో ఐశ్వర్యరాయ్

Aishwarya Rai Bachchan
ఈ మధ్యనే ‘నవాబ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు మణిరత్నం ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాతో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పదవ శతాబ్దంలో సాగే పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. చోళ వంశానికి చెందిన అరుల్మోజీ వర్మన్ జీవితం మీద ఆధారిత మై ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ చాలా కాలం తర్వాత మళ్లీ సౌత్ సినిమాలో కనిపించబోతోంది.
పెళ్లి తరువాత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్న ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో కూడా ఒక ఆసక్తికరమైన పాత్ర పోషించబోతోంది.ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ పాత్ర పేరు నందిని అని ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. కేవలం తన స్వార్థం కోసం ఇతరులను మోసం చేసే వ్యక్తిత్వం ఉన్న మహిళ పాత్రలో ఐశ్వర్యరాయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ పాత్ర మహారాజు పెరియ పజహువేత్తరైయర్ భార్య గా కనిపించనుంది. ఈ సినిమాలో విక్రమ్, శింబు, జయం రవి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అమలాపాల్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతోంది అని తెలుస్తోంది.