Telugu Global
NEWS

చంద్రబాబు నోరు జారడమే కొంప ముంచిందా..?

అధికారంలో ఉన్నాము కదా అని ఎవరి మీద పడితే వారి మీద నోరు జారితే ఎలా ఉంటుందో తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలిసి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ గోపాల కృష్ణ ద్వివేదీపై ఇష్టానుసారం ఆరోపణలు చేయడం చంద్రగిరి కూడా రీపోలింగ్‌కు ఒక కారణమని ఉన్నత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏపీలో ఏప్రిల్ 11న లోక్‌సభ, అసెంబ్లీకి పోలింగ్ నిర్వహించారు. అదే రోజు 10.30 గంటలకే ఈవీఎంలు మోరాయిస్తున్నాయంటూ ప్రచారం చేయడమే కాకుండా.. […]

చంద్రబాబు నోరు జారడమే కొంప ముంచిందా..?
X

అధికారంలో ఉన్నాము కదా అని ఎవరి మీద పడితే వారి మీద నోరు జారితే ఎలా ఉంటుందో తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలిసి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ గోపాల కృష్ణ ద్వివేదీపై ఇష్టానుసారం ఆరోపణలు చేయడం చంద్రగిరి కూడా రీపోలింగ్‌కు ఒక కారణమని ఉన్నత వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఏపీలో ఏప్రిల్ 11న లోక్‌సభ, అసెంబ్లీకి పోలింగ్ నిర్వహించారు. అదే రోజు 10.30 గంటలకే ఈవీఎంలు మోరాయిస్తున్నాయంటూ ప్రచారం చేయడమే కాకుండా.. ఏకంగా సీఈవో గోపాలకృష్ణ ద్వివేది వద్దకు వెళ్లి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ను పట్టుకొని అసలు మీరు చదువుకున్నారా..? అంటూ ప్రశ్నించడం రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.

చంద్రబాబు అంతటితో ఆగకుండా పలుమార్లు ఢిల్లీ వేదికగా ఈసీపై ఆరోపణల చేస్తూ వచ్చారు. ఇవన్నీ ఈసీ ఎప్పటికిప్పుడు గమనిస్తూనే ఉంది. చివరకు చంద్రగరిలో జరిగిన రిగ్గింగ్ గురించి వీడియోతో సహా బయటపడటంతో ఈసీకి ఛాన్స్ దొరికినట్లైంది. టీడీపీ రిగ్గింగ్ చేసినట్లు తెలిసిన 5 కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించింది.

చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ ఎలాగైనా ఈ సారి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని అక్రమాలకు తెరలేపారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన వైసీపీ నాయకులు ఈసీకి పిర్యాదు చేశారు. ఆ పిర్యాదుపై విచారణ చేసి ఈసీ రీపోలింగ్‌కు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు చేసిన రచ్చే చివరికి తన మెడకు చుట్టుకుందని పలువురు అంటున్నారు.

మరో రెండు చోట్ల రీపోలింగ్

చంద్రగిరి నియోజకవర్గంలోని మరో రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తుదిదశ ఎన్నికలకు కొద్ది గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు, కాలూరులో కూడా ఆదివారం రీపోలింగ్ నిర్వహించనున్నారు.

First Published:  18 May 2019 4:28 AM GMT
Next Story