డ్రగ్స్ వివాదంపై నోరు విప్పిన చార్మి

ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి ఇమేజ్ ను సంపాదించిన ఈమె తాజాగా తన 31 జన్మదిన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి మాట్లాడింది చార్మి. నటిగా కంటే నిర్మాతగా గానే తను సంతృప్తిగా ఉందని, ఇకపై కూడా నిర్మాతగానే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చింది చార్మి.
అంతేకాక ఒకప్పుడు సంచలనం సృష్టించిన డ్రగ్స్ వివాదం లో ఛార్మి పేరు కూడా వినిపించింది. దీనిపై స్పందించిన చార్మి అది తన జీవితంలో బాధాకరమైన ఫేజ్ అని, ఆ సమయంలో తాను అవమానం వల్ల డిప్రెషన్ లోకి కూడా వెళ్లినట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు కూడా చాలా బాధపడ్డారని. విషయం తెలియగానే వారు కుప్ప కూలిపోయారని. ఆ వయసులో వారిని ఇంత మనస్థాపానికి గురి అయ్యారని చెప్పిన ఛార్మిని ఎప్పటికైనా డ్రగ్స్ కేసు నుంచి క్లీన్ చిట్ తో బయటకు వస్తానని చెప్పుకొచ్చింది.