Telugu Global
NEWS

ఐపీఎల్ తో నీరుగారిపోయిన భారత క్రికెటర్లు

అవిశ్రాంత క్రికెట్ తో అలిసిపోయిన విరాట్ అండ్ కో  టీమిండియాకు ప్రపంచకప్ పరీక్ష రెండువారాలే విశ్రాంతి, జూన్ 5న తొలిమ్యాచ్ ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు ప్రధాన ఆటగాళ్లంతా …ఏడువారాలు, 14 రౌండ్ల ఐపీఎల్ మ్యాచ్ లతో తీవ్రంగా అలసి పోయారా? తగిన విశ్రాంతి లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న విరాట్ సేన పూర్తిస్థాయిలో రాణించగలదా? అన్న సందేహాలను క్రికెట్ విశ్లేషకులు లేవనెత్తుతున్నారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30న ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఐదుసార్లు […]

ఐపీఎల్ తో నీరుగారిపోయిన భారత క్రికెటర్లు
X
  • అవిశ్రాంత క్రికెట్ తో అలిసిపోయిన విరాట్ అండ్ కో
  • టీమిండియాకు ప్రపంచకప్ పరీక్ష
  • రెండువారాలే విశ్రాంతి, జూన్ 5న తొలిమ్యాచ్

ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు ప్రధాన ఆటగాళ్లంతా …ఏడువారాలు, 14 రౌండ్ల ఐపీఎల్ మ్యాచ్ లతో తీవ్రంగా అలసి పోయారా? తగిన విశ్రాంతి లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న విరాట్ సేన పూర్తిస్థాయిలో రాణించగలదా? అన్న సందేహాలను క్రికెట్ విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30న ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లండ్ తో సహా మిగిలిన ప్రధాన జట్లన్నీ పూర్తి విశ్రాంతి, తగిన సన్నాహాలతో బరిలోకి దిగుతుంటే… విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు మాత్రం… ఐపీఎల్ టోర్నీ ప్రాక్టీస్ తోనే కొద్దిరోజుల నామమాత్ర విశ్రాంతి తర్వాత టోర్నీలో పాల్గొనబోతున్నారు.

కొహ్లీ, రాహుల్ లకు మాత్రమే తగిన విశ్రాంతి…

దేశవ్యాప్తంగా 11 వేదికల్లో ఏడువారాలపాటు సాగిన ఐపీఎల్ వివిధ ఫ్రాంచైజీల తరపున భారత ప్రధానక్రికెటర్లంతా పాల్గొన్నారు.
కెప్టెన్ విరాట్ కొహ్లీ, లెగ్ స్పిన్నర్ చాహల్ బెంగళూరు, ధోనీ, జడేజా, కేదార్ జాదవ్ చెన్నై తరపున, రోహిత్ శర్మ, బుమ్రా, హార్థిక్ పాండ్యా ముంబై తరపున, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్ సన్ రైజర్స్ తరపున లీగ్ లో పాల్గొన్నారు.

ఇక …దినేశ్ కార్తీక్ , కుల్దీప్ యాదవ్ కోల్ కతా, రాహుల్, షమీ పంజాబ్, శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పాల్గొన్నారు.
బెంగళూరు, పంజాబ్, కోల్ కతా జట్ల పోటీ లీగ్ దశలోనే ముగియడంతో విరాట్ కొహ్లీ, చాహల్, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తీక్, రాహుల్, షమీలకు తగిన విశ్రాంతే లభించింది.

అయితే… ముంబై, చెన్నై ఫైనల్స్ చేరడంతో కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, పాండ్యా, బుమ్రా, ధోనీ, జడేజా మే 12 వరకూ మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.

మే 20న ఇంగ్లండ్ కు టీమిండియా ప్రయాణం

ఐపీఎల్ ముగిసిన ఎనిమిదిరోజుల విరామం లోనే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని 15మంది సభ్యుల భారతజట్టు ప్రపంచకప్ లో పాల్గొనటానికి… మే 20న ఇంగ్లండ్ కు బయలుదేరనుంది.

జూన్ 5న సౌతాఫ్రికాతో ప్రారంభ మ్యాచ్ కు ముందు… టీమిండియా కేవలం రెండు ప్రాక్టీస్ వన్డేలలో మాత్రమే పాల్గొనాల్సి ఉంది.
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడనుంది.

మరోవైపు… పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు కొద్దివారాలు ముందుగానే ఇంగ్లండ్ చేరుకొని… వన్డే సిరీస్ ల్లో పాల్గొనటం ద్వారా అక్కడి వాతావరణానికి అలవాటు పడటంతో పాటు విలువైన ప్రాక్టీస్ ను సంపాదించుకోగలిగాయి.

టీమిండియాకు ఆ సత్తా ఉంది…

తగిన విశ్రాంతి లేకున్నా…ప్రపంచకప్ లో రాణించే సత్తా టీమిండియాకు ఉందని భారత క్రికెటర్ పార్థివ్ పటేల్ అంటున్నాడు. మే 12 నుంచి తొలిమ్యాచ్ ఆడే జూన్ 5 వరకూ 25 రోజుల సమయం ఉంటుందని…ఈలోగా అన్నివిధాల కోలుకొని మ్యాచ్ ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ఆడుతూ వచ్చిన భారతజట్టు సభ్యులు కొద్దిరోజుల వ్యవధిలోనే 50 ఓవర్ల ఫార్మాట్ కు ఎంత త్వరగా అలవాటు పడతారన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  17 May 2019 7:02 PM GMT
Next Story