త్వరలో విడుదల కాబోతున్న వివాదాస్పద వెబ్ సిరీస్

ప్రస్తుతం భారతదేశంలో పాపులర్ అవుతున్న డిజిటల్ వెబ్ సైట్స్ లో నెట్ఫ్లిక్స్ ఒకటి. ఈ నేపథ్యంలో తాజాగా నెట్ఫ్లిక్స్ లో త్వరలో విడుదల కాబోతున్న ఒక ఇండియన్ వెబ్ సిరీస్ బోలెడు వివాదాలకు దారి తీసే లాగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలో ‘లైలా’ అనే ఒక వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది.
ఈ వెబ్ సిరీస్ లో ‘ఆర్యవ్రత’ అనే ఒక మతానికి చెందిన వారు తమ మతంలో మిక్స్డ్ బ్లడ్ ఉండకూడదని వేరే మతాల వారిని పెళ్లి చేసుకున్న వారి పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేస్తూ ఉంటారు.హ్యూమా కురేషి ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు దీపా మెహతా దర్శకత్వం వహించారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇందులో హిందూ మతానికి సంబంధించిన కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అలా హీరోయిన్ పాప మిక్స్డ్ బ్లడ్ అని తీసుకెళ్లి పోగా ఆమె కూతురి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో సౌత్ హీరో సిద్ధార్థ్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ప్రయాగ అక్బర్ రాసిన ‘లైలా’ అనే బుక్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది.