ఆగ్రహంలో డబ్బింగ్ ఆర్టిస్ట్.. సారి చెప్పిన హీరోయిన్

క్యూట్ బ్యూటీ రాశిఖన్నా ఈ మధ్యనే తమిళ సినిమా ‘ఆయోగ్య’ లో హీరోయిన్ గా నటించింది. తెలుగు ‘టెంపర్’ సినిమాకి రీమేక్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో రాశి కన్నా పాత్రకు రవీనా అనే యువతి డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా సినిమాలో తనకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. “అయోగ్య సినిమా తర్వాత టైటిల్స్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ కు క్రెడిట్స్ ఇవ్వలేదు.

“షూటింగ్ లో ఉన్న డ్రైవర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, సౌండ్ ఇంజనీర్ ల పేర్లు కూడా వేశారు కానీ డబ్బింగ్ మాత్రం పట్టించుకోలేదు” అని బాధగా ట్వీట్ చేశారు రవీన. ఈ నేపథ్యంలో లో రియాక్ట్ అయిన రాశి ఖన్నా, “నన్ను క్షమించు రవీనా. నీ మధురమైన స్వరాన్ని అందించి నా పాత్రను మరింత అందంగా మలిచావు. ధన్యవాదాలు” అంటూ రవీనా ట్వీట్‌కు రాశీ బదులిచ్చారు. దీనికి రిప్లై ఇస్తూ ‘థాంక్యూ రాశీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నీ తప్పు కాదు. నీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉంది” అని ట్వీట్‌ చేశారు.