వెన్నుపోటు బాబుకే వెన్నుపోటా?

తెలుగురాష్ట్రాల్లో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే ఠక్కున చంద్రబాబు పేరే చెబుతారు ఆయన ప్రత్యర్థులు. మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని హైజాక్ చేసి ఆయన చావుకు కారణమైన బాబు గురించి ప్రతిపక్ష వైసీపీ సహా వైరిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటాయి.

అయితే ఆ తర్వాత చంద్రబాబు ఎంతమందికి వెన్నుపోటు పొడిచారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం బాబుకు వెన్నుపోటు పొడిచేందుకు జగన్ కారణమవుతున్నాడని సమాచారం. అయితే పొడిచేది జగన్ కాదు.. వేరే పార్టీ.

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికే సర్వేలు తేల్చేశాయి. ఇటు తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఈ రెండు పార్టీలను కలుపుకుంటే దాదాపు 30 నుంచి 35 ఎంపీ సీట్లు దక్కుతాయి. ఇప్పుడు ఈ అవకాశాన్నే జగన్, కేసీఆర్ లు అందిపుచ్చుకోవాలని యోచిస్తున్నాయి.

కేంద్రంలో హంగ్ వస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలోనే వైసీపీ అలెర్ట్ అయ్యింది. తమ హామీలు నెరవేర్చే పార్టీకే మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే జగన్, కేసీఆర్ లతో జాతీయ పార్టీలు చర్చలకు పరుగులు తీస్తున్నాయి.

అయితే కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు లేవంటున్నారు. కానీ లీడింగ్ పార్టీగా మారే అవకాశాలున్నాయట… ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తే కాంగ్రెస్ సర్కారు ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే కేసీఆర్ కూడా కాంగ్రెస్ వైపు తిరిగారు. అయితే జగన్ మాత్రం కాంగ్రెస్ కూటమిలోకి చేరాలనుకుంటే చంద్రబాబు ఉంటే ఒప్పుకోరు.

ఇటు కేసీఆర్ కూడా తనను ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబు కాంగ్రెస్ తో ఉంటే కలవడానికి ఇష్టపడరు. అందుకే బాబు ఉన్న కూటమిలోకి కేసీఆర్, జగన్ రావాలంటే బాబును సైడ్ చేయాల్సిందేనన్న ప్రచారం కాంగ్రెస్ లో సాగుతోంది. పైగా చంద్రబాబు ఇటు కాంగ్రెస్‌తో ఉంటూనే అటు బీజేపీతో రహస్యమంతనాలు ఆడడం కూడా కాంగ్రెస్‌ నాయకులకు నచ్చడం లేదు.

కాబట్టి ఏదో సాకుతో చంద్రబాబును వదిలించుకోవడానికి కాంగ్రెస్ ఆలోచిస్తోందని.. జగన్ వస్తానంటే నిర్ధాక్షిణ్యంగా బాబును గెంటేస్తారనే ప్రచారం జరుగుతోంది.

అదే కనుక జరిగితే కాంగ్రెస్ ను నమ్మిన బాబుకు ఇంతకంటే వెన్నుపోటు ఉండదు.. అదే సమయంలో దేశ రాజకీయాల్లో అటు బీజేపీతో పోరాడుతూ.. ఇటు కాంగ్రెస్ చీకొడితే ఏకాకిగా మారిపోవడం ఖాయమంటున్నారు.