Telugu Global
NEWS

లగడపాటి సర్వేలు తారుమారైన సందర్భాలివే..

సర్వేల కింగ్, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఉన్నట్టుండి శనివారం సాయంత్రం ఊడిపడి తన సర్వేను బయటపెట్టాడు. తెలంగాణలో కారు జోరు.. ఆంధ్రాలో టీడీపీ సైకిల్ కే మొగ్గు ఉంటుందని చూచాయగా చెప్పుకొచ్చాడు. అయితే ఇది అంచనా మాత్రమేనని.. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వివరంగా చెబుతానని చెప్పాడు. అయితే లగడపాటి సర్వేలు కూడా బోల్తా పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే తప్పుల తడకగా.. ఎవరికో ప్రయోజనం కలిగించేలా లగడపాటి […]

లగడపాటి సర్వేలు తారుమారైన సందర్భాలివే..
X

సర్వేల కింగ్, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఉన్నట్టుండి శనివారం సాయంత్రం ఊడిపడి తన సర్వేను బయటపెట్టాడు. తెలంగాణలో కారు జోరు.. ఆంధ్రాలో టీడీపీ సైకిల్ కే మొగ్గు ఉంటుందని చూచాయగా చెప్పుకొచ్చాడు. అయితే ఇది అంచనా మాత్రమేనని.. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వివరంగా చెబుతానని చెప్పాడు. అయితే లగడపాటి సర్వేలు కూడా బోల్తా పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే తప్పుల తడకగా.. ఎవరికో ప్రయోజనం కలిగించేలా లగడపాటి చెప్పారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఫలితం తేడాకొట్టడంతో లగడపాటి విశ్వసనీయత కోల్పోయారు. తెలంగాణలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని చెప్పగా.. టీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది. అయితే తెలంగాణ ఫలితం తప్పడానికి కారణం చెబుతానంటూ లగడపాటి నిన్న తప్పించుకున్నాడు.

అయితే లగడపాటి సర్వేలు ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు.. గతంలో చాలా సర్వేలు తారుమారైన సందర్భాలున్నాయి. 2016 మే లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో లగడపాటి జయలలిత పార్టీ అన్నాడీఎంకే ఓడిపోతుందని.. కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పాడు. కానీ అక్కడ జయలలిత గెలిచి రికార్డు సృష్టించింది. అన్నాడీఎంకే కు 134 సీట్లు రాగా.. డీఎంకేకు 89 సీట్లు మాత్రమే వచ్చాయి.

ఇక 2018 మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా మెజారిటీ సర్వేలు హంగ్ వస్తుందని చెప్పగా.. లగడపాటి మాత్రమే బీజేపీ గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఎవరి మద్దతు లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. అక్కడా భూమరాంగ్ అయ్యింది. హంగ్ వచ్చింది.

అయితే తనకు ఏ పార్టీతో సంబంధాలు లేవని.. జగన్ మిత్రుడేనంటూ లగడపాటి చెప్పుకొచ్చాడు. కానీ విజయవాడలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశానికి లగడపాటి టీడీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ , అశోక్ బాబు, బుద్దా వెంకన్నలతో కలిసి మీడియా సమావేశానికి రావడం విశేషం. దీన్ని బట్టి టీడీపీకి ఫేవర్ గానే లగడపాటి రాజకీయం నడుపుతున్నారని అర్థమవుతోంది.

First Published:  19 May 2019 3:36 AM GMT
Next Story