సమంత సినిమాలో చేంజెస్ చెప్పిన సురేష్ బాబు

ఒకవైపు చిన్న బడ్జెట్ సినిమాలకు తన ప్రొడక్షన్ బ్యానర్ తో మద్దతిస్తూ ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు మరోవైపు స్టార్లతో కూడా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘మజిలీ’ సినిమాతో హిట్ అందుకున్న సమంత ‘ఓ బేబీ’ అనే సినిమాలో నటించింది. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. సౌత్ కొరియన్ హిట్ సినిమా ‘మిస్ గ్రాని’ కి రీమేక్ గా ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫైనల్ కాపీని సురేష్ బాబు కి చూపించారట. అయితే సినిమా చూపించిన సురేష్ బాబు చిత్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. సినిమా సెకండ్ హాఫ్ లో సురేష్ బాబు చెప్పిన చేంజెస్ చేయటం లో ప్రస్తుతం చిత్రబృందం బిజీగా ఉంది. నాగశౌర్య, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ మూడవ వారంలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.