Telugu Global
Cinema & Entertainment

వెంకీ మామా టీజర్ విడుదల అప్పుడేనా

ఈ మధ్యనే మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ సినిమాలో నటించి హిట్ అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామా’ అనే మరొక మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లోని మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ […]

వెంకీ మామా టీజర్ విడుదల అప్పుడేనా
X

ఈ మధ్యనే మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ సినిమాలో నటించి హిట్ అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామా’ అనే మరొక మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లోని మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మధ్యనే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘వెంకీ మామా’ సినిమా టీజర్ జులై 6వ తేదీన రామానాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే పోస్టర్ డిజైన్ లు మరియు టీజర్ కట్స్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

First Published:  19 May 2019 3:28 AM GMT
Next Story