Telugu Global
Cinema & Entertainment

అధికారికంగా లాంచ్ అయినా విజయ్ దేవరకొండ సినిమా

టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ‘టాక్సీవాలా’ అనే Zసినిమాతో మరో హిట్ ను నమోదు Iచేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జులైలో విడుదల కానుంది. ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ తో రొమాన్స్ చేసిన రష్మిక మందన్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో చేయబోతున్న సంగతి […]

అధికారికంగా లాంచ్ అయినా విజయ్ దేవరకొండ సినిమా
X

టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ‘టాక్సీవాలా’ అనే Zసినిమాతో మరో హిట్ ను నమోదు Iచేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జులైలో విడుదల కానుంది. ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ తో రొమాన్స్ చేసిన రష్మిక మందన్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది.విజయ్ దేవరకొండ-ఆనంద్ అన్నామలై చిత్రం ఇవాళ అధికారికంగా లాంచ్ చేశారు. స్టార్ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు క్లాప్ కొట్టి స్క్రిప్ట్ అందించగా, గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ‘పెట్టా’ సినిమాలో కనిపించిన మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎంత వరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

First Published:  19 May 2019 3:24 AM GMT
Next Story