Telugu Global
NEWS

జాతీయ నాయకులు సైలెంట్‌ అయినా.... బాబు మాత్రం తగ్గట్లేదు...

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి. అయినా చంద్రబాబు ఢిల్లీ వేదికగా ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మవద్దని.. తమదే గెలుపు అని టీడీపీ నేతలకు హితబోధ చేస్తున్నారు. మోడీ ప్రభంజనం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ-బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. సైలెంట్‌ అయిపోయాయి. కానీ చంద్రబాబులో మాత్రం ఆశ చావడం లేదు. ఎలాగైనా మోడీని గద్దెదించాలనే […]

జాతీయ నాయకులు సైలెంట్‌ అయినా.... బాబు మాత్రం తగ్గట్లేదు...
X

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి. అయినా చంద్రబాబు ఢిల్లీ వేదికగా ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మవద్దని.. తమదే గెలుపు అని టీడీపీ నేతలకు హితబోధ చేస్తున్నారు.

మోడీ ప్రభంజనం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ-బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. సైలెంట్‌ అయిపోయాయి. కానీ చంద్రబాబులో మాత్రం ఆశ చావడం లేదు. ఎలాగైనా మోడీని గద్దెదించాలనే ధ్యేయంతో కాలికి బలపం కట్టుకొని ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ కాంగ్రెస్ తో రాయబారం నడుపుతున్నారు.

ఈరోజు కోల్ కతా వెళ్లి మమతా తో చర్చలు జరుపుతారట..

ఎగ్జిట్ పోల్స్ వచ్చినా తన ఓటమిని బహిరంగంగా ఒప్పుకోని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇప్పటికీ టీడీపీ ఓడిపోతుందని బహిరంగంగా అంగీకరించడం లేదు. అయితే టీడీపీ ముఖ్యనాయకుల వద్ద మాత్రం పార్టీ ఓడిపోబోతుందనే చెబుతున్నాడట. ఓటమి వల్ల తన పాలన మీద, అవినీతి మీద ప్రజల దృష్టి మళ్ళకుండా…. మా ఓటమి ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నారట.

రేపు లేదా ఎల్లుండి ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలతో కలిసి వీవీ ప్యాట్స్ లెక్కించాలని ధర్నాకు చంద్రబాబు కూర్చోబోతున్నారని వార్తలొస్తున్నాయి.

మోడీ ప్రభుత్వంపై నమ్మకం లేదని.. అందుకే వీవీప్యాట్స్ లెక్కించి విజేతలను ప్రకటించాలని బాబు సహా పార్టీలు ఒత్తిడి తెస్తాయట. ఇలా ఓటమిని కూడా ఒప్పుకోకుండా రాజకీయం చేయడానికి బాబు గారు రెడీ అయిపోయారన్నమాట.

First Published:  20 May 2019 3:37 AM GMT
Next Story