Telugu Global
NEWS

ఇది దేనికి సంకేతం?

చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో ఆదివారం రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే రీపోలింగ్ అయినప్పటికీ ఇక్కడ భారీగా ఓటింగ్ జరగడం విశేషం. దాదాపు 89 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓట్లు వేయనీయకుండా దళితులను అడ్డుకున్నారని వైఎస్ఆర్ సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. అయితే నెలన్నర తరువాత రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ ఎన్నికల సంఘం మీద ఎదురు దాడికి దిగింది. కానీ, […]

ఇది దేనికి సంకేతం?
X

చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో ఆదివారం రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే రీపోలింగ్ అయినప్పటికీ ఇక్కడ భారీగా ఓటింగ్ జరగడం విశేషం. దాదాపు 89 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది.

ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓట్లు వేయనీయకుండా దళితులను అడ్డుకున్నారని వైఎస్ఆర్ సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు.

అయితే నెలన్నర తరువాత రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ ఎన్నికల సంఘం మీద ఎదురు దాడికి దిగింది. కానీ, ఈసీ ఇదేమీ పట్టించుకోకుండా తన పని తాను కానిచ్చేసింది. ఈ క్రమంలో దళితులు పెద్ద సంఖ్యలో కదిలి వచ్చి ఓట్లు వేయడం విశేషంగా చెబుతున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడ దళితులను ఓట్లు వేయనీయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటూనే ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈసారి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి వారి చేత ఓట్లు వేయించగలిగిందని అంటున్నారు. కొందరు వృద్ధులు కూడా తాము తొలిసారి ఓటు వేస్తున్నామని చెప్పడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు. టీడీపీ ఆరోపించినట్టుగా వైఎస్ఆర్ సీపీ కావాలని గొడవ చేసి ఉంటే రీపోలింగ్ లో భారీ ఓటింగ్ జరిగి ఉండేది కాదంటున్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని చెబుతున్నారు.

చంద్రబాబు విజయం సాధించడానికి ఎంతకైనా తెగిస్తారనే విషయం దళితుల ఓట్లను అడ్డుకోవడం ద్వారా తేటతెల్లం అయిందంటున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాలలో వ్యవహరించాల్సిన తీరు గురించి టీడీపీ తమ ఏజెంట్లకు ఇచ్చిన సూచనలు కలకలం రేపుతున్నాయి.

తాము వెనుకంజలో ఉండే ప్రతి చోటా రీకౌంటింగ్ కు డిమాండ్ చేయాలని, ఆర్ఓలు ఫలితాలు ప్రకటించకుండా అడ్డుకోవాలని ఏజెంట్లకు నూరిపోయడం టీడీపీ కుటిల నీతిని బట్టబయలు చేస్తోందని అంటున్నారు. ఓటమి భయంలో పడిపోయిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు కావాలని ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికే వీవీ ప్యాట్ల లెక్కింపు అనే అంశంతో ఫలితాల వెల్లడి ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకూ లెక్కలు సరిపోలకపోతే కూడా ఫిర్యాదు చేయాలని, లెక్కింపును అడ్డకోవాలని టీడీపీ తన ఏజెంట్లకు సూచించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ఫ్రస్టేషన్ తోనే ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

First Published:  19 May 2019 10:41 PM GMT
Next Story