Telugu Global
NEWS

రేపే కౌంటింగ్ : రెండు గంటల్లో తెలిసిపోనున్న ట్రెండింగ్స్

సుదీర్ఘంగా జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5.30 గంటలకే స్ట్రాంగ్ రూమ్స్ తెరుచుకోనున్నాయి. మూడంచెల భద్రత నడుమ కౌంటింగ్ టేబుల్స్ వద్దకు చేర్చి పలు రౌండ్లుగా లెక్కింపు చేపడతారు. ముందుగా ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించి.. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమైన రెండు […]

రేపే కౌంటింగ్ : రెండు గంటల్లో తెలిసిపోనున్న ట్రెండింగ్స్
X

సుదీర్ఘంగా జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5.30 గంటలకే స్ట్రాంగ్ రూమ్స్ తెరుచుకోనున్నాయి. మూడంచెల భద్రత నడుమ కౌంటింగ్ టేబుల్స్ వద్దకు చేర్చి పలు రౌండ్లుగా లెక్కింపు చేపడతారు.

ముందుగా ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించి.. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల తర్వాత నుంచి ట్రెండింగ్స్ తెలిసిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 12 గంటల కల్లా కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.

ఇక రిటర్నింగ్ అధికారులు ప్రతీ రౌండ్ ఫలితాన్ని పార్టీ ఏజెంట్లకు ఇచ్చి ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటే ఈ-సువిధలో చేరుస్తారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ ప్రాసెస్ జరగడానికి కొంచెం సమయం పడుతుంది. దీంతో అధికారిక ఫలితాలు వెల్లడించడంలో కొంత ఆలస్యం జరగవచ్చు.

మరోవైపు, కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపునకు టేబుళ్లతో పాటు పార్టీ ఏజెంట్లకు కూడా కుర్చీలు ఏర్పాటు చేసి వారికి నెంబర్లు కేటాయించారు. ప్రతీ ఏజెంట్ తమకు కేటాయించిన టేబుల్ వద్దే కూర్చోవాలని…. అటూ ఇటూ తిరగకూడదని అధికారులు చెబుతున్నారు.

ఈవీఎంల లెక్కింపు కూడా పూర్తయిన తర్వాత ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 5 కేంద్రాల వీవీప్యాట్లు లెక్కిస్తారు. వాటిని ఈవీఎం లెక్కతో సరిపోల్చిన తర్వాత తుది ఫలితాన్ని ప్రకటిస్తారని ఈసీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

First Published:  19 May 2019 8:31 PM GMT
Next Story