అవును…. నేను బ్యానర్ పెడుతున్నాను

హీరోయిన్ కాజల్ నిర్మాతగా మారబోతోందనే విషయం పాతదే. కేఏ వెంచర్స్ పేరిట ఆమె ప్రొడక్షన్ హౌజ్ పెట్టబోతోందంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ పుకార్లపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది కాజల్. తను నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నట్టు ప్రకటించింది.

“అవును.. నిజమే… నేను నిర్మాణ సంస్థ స్థాపించబోతున్నాను. దాని పేరు కూడా కేఏ వెంచర్స్. కానీ ఈ మేటర్ ఎలా బయటకు పొక్కిందో నాకు అర్థం కావడం లేదు. బ్యానర్ పెట్టడం మాత్రం ఖాయం. అయితే ఎప్పుడనేది చెప్పలేను. ప్రస్తుతం యాక్టింగ్ తో బిజీగా ఉన్నాను. కాస్త ఫ్రీ టైమ్ దొరికితే వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను.”

నిర్మాతగా మారే ఉద్దేశంతోనే రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి సినిమాకు ఆమె సమర్పకురాలిగా మారిందనే వార్తల్ని కాజల్ ఖండించింది. కేవలం రాజ్ కందుకూరిపై ఇష్టంతోనే ఆ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నానని, ఇదొక ఫార్మాలిటీ మాత్రమేనని తెలిపింది. ఆ సినిమా నిర్మాణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది.