అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతున్న కీతిక శర్మ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. మొదటి హీరోయిన్ గా ‘డిజే’ బ్యూటీ పూజా హెగ్డే అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతుండగా రెండవ హీరోయిన్ గా కీతిక శర్మను తీసుకున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి.

పాపులర్ బ్యూటీ కీతిక శర్మ ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర పోషించబోతోంది. రెండో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా త్రివిక్రమ్ కు… పాత్రల కోసం పాపులర్ హీరోయిన్లను తీసుకోవడం అలవాటే.

ఇప్పటికే పార్వతి మెల్టన్, అనుపమ పరమేశ్వరన్, ఈషా రెబ్బ వంటి హీరోయిన్లను తన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలో చూపించాడు త్రివిక్రమ్.

మరోవైపు బొమన్ ఇరానీ, టబు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.