మహర్షికి 11 రోజులు… నో బ్రేక్-ఈవెన్

రిలీజ్ రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న మహర్షి, మహేష్ బాబు చొరవతో హిట్ అయింది. రిలీజైన మొదటి రోజు నుంచి మొన్నటివరకు ఈ సినిమా కోసం మహేష్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. పొద్దున్న లేస్తే ఏదో ఒక థియేటర్ కు వెళ్లడం, లేదంటే మీడియా ముందు కూర్చోవడం చేశాడు. మహేష్ తన కెరీర్ లో ప్రచారం కోసం ఎప్పుడూ ఇంతలా కష్టపడలేదు.

మహేష్ కష్టం వృధాపోలేదు. అతడి సినిమా ప్రస్తుతం థియేటర్లలో బాగానే నడుస్తోంది. నైజాంలో అయితే మహర్షికి తిరుగులేదు. కళ్లుచెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. నాన్-బాహుబలి రికార్డు సృష్టిస్తోంది. ఏపీ,నైజాం మొత్తం ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది. కానీ ఈ సినిమా ఇంకా బ్రేక్-ఈవెన్ అందుకోలేదు. ఈ వీకెండ్ నాటికి అది బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనేది ఓ అంచనా. నిన్నటితో 11 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు (షేర్లు) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 25.40 కోట్లు
సీడెడ్ – రూ. 9.06 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.94 కోట్లు
ఈస్ట్ – రూ. 7.92 కోట్లు
వెస్ట్ – రూ. 5.51 కోట్లు
గుంటూరు – రూ. 7.86 కోట్లు
నెల్లూరు – రూ. 2.70 కోట్లు
కృష్ణా – రూ. 5.42 కోట్లు