Telugu Global
Cinema & Entertainment

రికార్డు సృష్టించబోతున్న.... తమన్నా, ప్రభుదేవా

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా మరియు సౌత్ పాపులర్ హీరో ప్రభుదేవా కలిసి ఇప్పుడు ఒక రేర్ రికార్డును సృష్టించబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన రెండు వేరు వేరు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. అవే ‘దేవి 2’ మరియు ‘ఖామోషీ’. తమిళ హారర్ కామెడీ ‘దేవి 2’ సినిమా ‘దేవి’ సినిమాకి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభుదేవా, తమన్నా నటించిన అదే సినిమా ‘అభినేత్రి 2’ అనే టైటిల్ తో తెలుగులో […]

రికార్డు సృష్టించబోతున్న.... తమన్నా, ప్రభుదేవా
X

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా మరియు సౌత్ పాపులర్ హీరో ప్రభుదేవా కలిసి ఇప్పుడు ఒక రేర్ రికార్డును సృష్టించబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన రెండు వేరు వేరు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. అవే ‘దేవి 2’ మరియు ‘ఖామోషీ’.

తమిళ హారర్ కామెడీ ‘దేవి 2’ సినిమా ‘దేవి’ సినిమాకి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభుదేవా, తమన్నా నటించిన అదే సినిమా ‘అభినేత్రి 2’ అనే టైటిల్ తో తెలుగులో కూడా రాబోతోంది. ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మరోవైపు ‘ఖామోషీ’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభుదేవా…. తమన్నా పాత్రను చంపడానికి వచ్చే సైకో పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు చిత్రాలకి సంబంధించిన ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది.

ఈ రెండు సినిమాలు ఒకే రోజు మే 31న విడుదల కాబోతున్నాయి. ఆ రోజు పెద్దగా కాంపిటీషన్ కూడా లేకపోవడంతో రెండు సినిమాలూ హిట్ అయ్యే ఛాన్స్ లు బాగానే ఉన్నాయి.

First Published:  20 May 2019 12:43 AM GMT
Next Story