Telugu Global
Cinema & Entertainment

'మజిలీ' తెచ్చిన గొడవ....నిజమేనా?

సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో స్టార్ కపుల్స్. అయితే వీరిద్దరి మధ్య గొడవ అయిందని తెలుస్తోంది. ప్రతి స్టార్ హీరోయిన్ లాగానే సమంతకు కూడా వ్యక్తిగత సిబ్బంది ఉంది. హెయిర్ స్టైల్ కి ఒకరు, మేకప్ కి ఒకరు, ఇలా ప్రతి దానికి ఒకరు సమంత కోసం పనిచేస్తూ ఉంటారు. తాజాగా పెళ్లయిన తర్వాత మొట్టమొదటి సారిగా సమంత, నాగచైతన్య కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నాగచైతన్య, సమంత […]

మజిలీ తెచ్చిన గొడవ....నిజమేనా?
X

సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో స్టార్ కపుల్స్. అయితే వీరిద్దరి మధ్య గొడవ అయిందని తెలుస్తోంది. ప్రతి స్టార్ హీరోయిన్ లాగానే సమంతకు కూడా వ్యక్తిగత సిబ్బంది ఉంది. హెయిర్ స్టైల్ కి ఒకరు, మేకప్ కి ఒకరు, ఇలా ప్రతి దానికి ఒకరు సమంత కోసం పనిచేస్తూ ఉంటారు.

తాజాగా పెళ్లయిన తర్వాత మొట్టమొదటి సారిగా సమంత, నాగచైతన్య కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నాగచైతన్య, సమంత వీరిద్దరిలో ఎవరు బాగా నటించారు అనే విషయంపై వీరిద్దరి వ్యక్తిగత సిబ్బంది మధ్య వాదోపవాదాలు జరిగాయని చెబుతున్నారు.

ఈ విషయం నాగచైతన్య చెవిన కూడా పడడంతో…. డైరెక్ట్ గా వెళ్లి సమంత సిబ్బందిని ఎవరు బాగా చేశారు అని అడిగేశాడట. సమంత సిబ్బంది సమంత బాగా చేసిందని చెప్పడంతో చైతూ హర్ట్ అయ్యాడట. ఇందులో ఒకరిని పనిలోనుండి కూడా తీసేసాడని టాక్.

అప్పుడు మళ్ళీ సమంత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

First Published:  19 May 2019 9:57 PM GMT
Next Story