Telugu Global
Cinema & Entertainment

'కార్టూన్' గా.... 'ఫలక్ నుమా దాస్'

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా లో నటించిన విశ్వక్ సేన్ మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘ఫలక్ నుమా దాస్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహిస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే విశ్వక్ తన తదుపరి సినిమా లైన్లో పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం ఒక కొత్త […]

కార్టూన్ గా.... ఫలక్ నుమా దాస్
X

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా లో నటించిన విశ్వక్ సేన్ మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా ‘ఫలక్ నుమా దాస్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహిస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే విశ్వక్ తన తదుపరి సినిమా లైన్లో పెట్టాడు.

తాజా సమాచారం ప్రకారం ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు విశ్వక్. ఈ సినిమాకి ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రానికి ‘కార్టూన్’ అనే టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది. ప్రదీప్ పులివర్తి ఈ సినిమాతో తెలుగులో దర్శకుడి గా ఎంట్రీ ఇవ్వనున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని ఇవాళ అధికారికంగా లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ స్వయంగా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సినిమా కథ ఒక డిఫరెంట్ జానర్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 3వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

First Published:  20 May 2019 1:43 AM GMT
Next Story