ప్రపంచకప్ లో 70 కోట్ల ప్రైజ్ మనీ

  • విజేతగా నిలిచిన జట్టుకు 28 కోట్లు
  • రన్నరప్ గా నిలిచినజట్టుకు 14 కోట్లు
  • సెమీఫైనల్ చేరిన జట్లకు తలో 5 కోట్ల 60 లక్షలు
  • లీగ్ దశలో మ్యాచ్ నెగ్గితే 28 లక్షల నజరానా

ఐసీసీ వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీ ఇవ్వటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఏర్పాట్లు చేసింది.
ఇంగ్లండ్ అండ్ వేల్స్ దేశాలలోని మొత్తం 11 వేదికల్లో మే 30 నుంచి జులై 14 వరకూ 46 రోజులపాటు సాగే 48 మ్యాచ్ ల ఈ సమరం కోసం 10 దేశాల జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

మ్యాచ్ నెగ్గితే 28 లక్షలు…

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో నెగ్గిన జట్టుకు మ్యాచ్ కు 28 లక్షల రూపాయల చొప్పున నజరానాగా ఇస్తారు. ఇక … సెమీ ఫైనల్స్ చేరిన నాలుగు జట్లకూ…. 5 కోట్ల 60 లక్షల రూపాయల చొప్పున అందచేస్తారు.

కప్పు కొడితే 28 కోట్లు…

ఫైనల్స్ లో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ ప్రపంచకప్ తో పాటు 28 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఫైనల్లో ఓడిన జట్టుకు మాత్రం 14 కోట్ల రూపాయలు చెల్లిస్తారు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్ విజేత ముంబై ఇండియన్స్ కు 20 కోట్ల రూపాయలు, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ కు 12 కోట్ల 50 లక్షల రూపాయల చెక్ అందుకొన్నాయి.

క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ టోర్నీగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ చేరింది. మొత్తం 70 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ కోసమే ఐసీసీ కేటాయించింది.