Telugu Global
National

చంద్రబాబు ‘దింపుడు కళ్లెం’ ఆశలు...

తెలుగుదేశం పార్టీ అధినేత తన చివరి యత్నాలను ప్రారంభించారు. ఫలితాలకు ముందు విపక్షాలను ఏకం చేసి… ఢిల్లీలో హడావుడి చేయాలని వ్యూహరచన చేశారని అంటున్నారు. ఎన్నికల కార్యాలయం ముందు ప్రతిపక్ష నేతలతో కలిసి ధర్నా చేయాలని…. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల లెక్కింపు విషయాన్ని రచ్చరచ్చ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో విపక్షాలను ఒకే చోటకు చేర్చి ఫలితాలు అనుకూలంగా వస్తే ఏం చేయాలో కూడా చర్చించాలని అనుకున్నట్టు సమాచారం. కానీ, చంద్రబాబు ప్రయత్నాలకు ఆదిలోనే […]

చంద్రబాబు ‘దింపుడు కళ్లెం’ ఆశలు...
X

తెలుగుదేశం పార్టీ అధినేత తన చివరి యత్నాలను ప్రారంభించారు. ఫలితాలకు ముందు విపక్షాలను ఏకం చేసి… ఢిల్లీలో హడావుడి చేయాలని వ్యూహరచన చేశారని అంటున్నారు. ఎన్నికల కార్యాలయం ముందు ప్రతిపక్ష నేతలతో కలిసి ధర్నా చేయాలని…. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల లెక్కింపు విషయాన్ని రచ్చరచ్చ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

అదే సమయంలో విపక్షాలను ఒకే చోటకు చేర్చి ఫలితాలు అనుకూలంగా వస్తే ఏం చేయాలో కూడా చర్చించాలని అనుకున్నట్టు సమాచారం. కానీ, చంద్రబాబు ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

బెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫలితాల రోజు వరకూ తాను ఢిల్లీకి రాలేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు యూపీ నేత మాయావతి కూడా ఢిల్లీకి రావడానికి నిరాసక్తత వ్యక్తం చేశారని సమాచారం. తమిళనేత స్టాలిన్ రెస్పాన్స్ కూడా ఆశావహంగా లేదని అంటున్నారు.

ఏ విషయమైనా ఫలితాల తరువాతే మాట్లాడతానని ఆమె స్పష్టం చేశారని చెబుతున్నారు. మరోవైపు తమ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అధికారంలోకి ఎవరు వస్తే వారికే మద్దతు పలుకుతామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తేల్చి చెప్పారు.

ఈ పరిణామాల మధ్య చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీలో అధికారం దూరమయ్యే అవకాశాలు, కేంద్రంలోనూ ఆశలు సజీవంగా లేకపోవడం టీడీపీ శ్రేణులను కూడా తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని అంటున్నారు.

ఈ క్రమంలో తమ అధినేత చేసే ప్రయత్నాలు వృథా ప్రయాసే అని వారిలో వారు చర్చించుకుంటున్నారట. పరిస్థితులు తమకు అనుకూలంగా లేనపుడు మౌనంగా ఉండడమే మంచిదని చంద్రబాబుకు సలహా ఇస్తున్నారట.

కానీ, ఆయన ఇవేమీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ సరికొత్త ప్రతిపాదన చేసిందని అంటున్నారు. ఒక వేళ కేంద్రంలో ఎవ్వరికీ మెజారిటీ రాని పక్షంలో ప్రధాని పదవిని వదులుకునేందుకు తాము సిద్ధమనే సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు.

దీంతో మాయావతి, మమతా బెనర్జీలలో ఆశలు చిగురించాయని చెబుతున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని తీసుకుని చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, ఆ ఇద్దరు నేతలకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారని అంటున్నారు. వారు మాత్రం చంద్రబాబుకు ఎలాంటి అవకాశం మాత్రం ఇవ్వడం లేదంటున్నారు.

First Published:  20 May 2019 11:29 PM GMT
Next Story