దర్శకుడిగా మరబోతున్న కొరియోగ్రాఫర్

‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ అనే పాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయించిన గణేష్ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న గణేష్ మాస్టర్ ఇప్పుడు దర్శకత్వం వైపు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

గత కొంతకాలంగా గణేష్ మాస్టర్ త్వరలో దర్శకుడు అవతారం ఎత్తబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ విషయమై ఒక రెండు నెలల లోపు అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. ప్రభుదేవా, రాఘవ లారెన్స్ వంటి వారి లాగానే గణేష్ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్ గా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు దర్శకుడి రూపం ఎత్తబోతున్నారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో గణేష్ మాస్టర్ కు మంచి నెట్ వర్క్ ఉంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కూడా గణేష్ మాస్టర్ కలిసి పని చేశాడు. టాలీవుడ్ లో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్లతో కూడా గణేష్ మాస్టర్ కు సత్సంబంధాలు ఉన్నాయి. అగ్రనిర్మాతలలో చాలామంది గణేష్ మాస్టర్ కు సపోర్టు ఇస్తామని చెప్పారట. దీన్ని బట్టి చూస్తే గణేష్ మాస్టర్ అతి తొందరలోనే దర్శకుడి గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.