ఫ్లాప్ దర్శకుడి తో… ఫ్లాప్ హీరో

‘ఒక్క క్షణం’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు హీరో శిరీష్ తాజాగా ‘ఏబిసిడి’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మలయాళం సినిమా రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్ అప్పుడే తన తదుపరి సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ప్రేమ్ సాయి దర్శకత్వంలో అల్లు శిరీష్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సంవత్సరం క్రితమే ఈ సినిమా ఓకే అయింది. కానీ ఏడాదికాలంగా దర్శకుడు స్క్రిప్ట్ ల పై కసరత్తులు చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రేమ్ సాయి ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నితిన్ హీరోగా నటించిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మరి అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో ప్రేమ్ సాయి ఎంతవరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.