Telugu Global
Cinema & Entertainment

సైలెంట్ గా దుబాయ్ కి.... శేఖర్ కమ్ముల

‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘లీడర్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల ఈ మధ్యనే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమాతో ముందుకు రాబోతున్నాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే…. మరోవైపు శేఖర్ కమ్ముల మాత్రం తన తదుపరి సినిమా షూటింగ్ ఎటువంటి హైప్ లేకుండా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఒక పాపులర్ […]

సైలెంట్ గా దుబాయ్ కి.... శేఖర్ కమ్ముల
X

‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘లీడర్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల ఈ మధ్యనే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమాతో ముందుకు రాబోతున్నాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే…. మరోవైపు శేఖర్ కమ్ముల మాత్రం తన తదుపరి సినిమా షూటింగ్ ఎటువంటి హైప్ లేకుండా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

ఒక పాపులర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో కలిసి శేఖర్ కమ్ముల ఒక మల్టీడైమన్షన్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
కానీ దీని గురించిన అప్ డేట్స్ ఏవీ గత కొంతకాలంగా బయటకు రావటం లేదు. ఈ సినిమాలో అందరూ కొత్త నటీనటులు ఉండబోతున్నారని సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల తదుపరి షెడ్యూల్ ను దుబాయిలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. వారం పాటు సాగనున్న ఈ షెడ్యూల్ లో దుబాయ్ లోని కొన్ని అందమైన ప్రదేశాలలో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాల షూటింగ్ జరుపుకోబోతుంది. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మళ్లీ హైదరాబాద్ లో షూటింగ్ చేయనున్నారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  21 May 2019 4:33 AM GMT
Next Story