Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ వల్ల హార్ట్ అయిన తెలుగు హీరోయిన్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘డిజె’ సినిమాలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసిన పూజా హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర కోసం కేతిక శర్మను ఎంపిక చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘రొమాంటిక్’ లో హీరోయిన్ […]

త్రివిక్రమ్ వల్ల హార్ట్ అయిన తెలుగు హీరోయిన్
X

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘డిజె’ సినిమాలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసిన పూజా హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర కోసం కేతిక శర్మను ఎంపిక చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘రొమాంటిక్’ లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో రెండో హీరోయిన్ గా కనిపించబోతోంది.

అయితే ఈ భామ ను తీసుకోవడం ఒక తెలుగు హీరోయిన్ కు అసలు నచ్చలేదట. ఒక పాపులర్ తెలుగు అమ్మాయి అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఎప్పటినుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కాంటాక్ట్ లో ఉందని తెలుస్తోంది.

కేవలం నాలుగైదు సీన్లు ఒక పాటకు మాత్రమే పరిమితమైన ఈ పాత్ర ఎలాగైనా చేయాలని ఆమె అనుకుంది. దీని కోసం గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తాను కూడా గ్లామరస్ గా మారగలను అన్నట్లు హింట్లు కూడా ఇచ్చింది.

కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫైనల్ గా వేరే అమ్మాయిని సెలెక్ట్ చేయడంతో ఈ భామ నిరాశ చెందుతోందని తెలుస్తోంది.

First Published:  21 May 2019 2:37 AM GMT
Next Story