ఏపీలో అత్యధిక బెట్టింగ్ ఈ సీటుపైనే….

రేపే ఫలితాలు.. 23 మధ్యాహ్నం వచ్చే సరికి దేశంలో ఎవరిది అధికారం అనేది చూచాయగా తెలుస్తుంది. ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో ఏపీలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది.

అమరావతి, విజయవాడ, తాడేపల్లి, ఉండవల్లి, తెనాలి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కేంద్రాలుగా బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. లక్షల్లో ప్రజలు, ఔత్సాహికులు కూడా పందాలు కాస్తున్నారు.

ఆదివారం ఎగ్జిట్ పోల్స్ రావడంతో ముఖ్యంగా ఏపీలో గెలుపు ఎవరిది అనే దానిపై పెద్దగా పందాలు సాగడం లేదు. నియోజకవర్గాల వారీగా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో అభ్యర్ధి గెలుపు మీద అత్యధికంగా బెట్టింగ్ కాస్తున్నారు.

ఇక నియోజక వర్గాల వారీగా చూస్తే…. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు పోటీచేసిన మంగళగిరి ఫలితం పైనే లక్షల్లో బెట్టింగ్ లు కాస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ నుంచి బలమైన అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. దీంతో లోకేష్ బాబు ప్రతిష్ట, టీడీపీ భవిష్యత్ లీడర్ అన్న కారణంగా మంగళగిరి స్థానంపై అత్యధికంగా బెట్టింగ్ లు కాస్తున్నట్టు సమాచారం.

ఇక కేంద్రంలో బీజేపీ గెలుపోటమిపై కూడా పందాలు కాస్తున్నారు.

కీలక స్థానాల్లో పోటీపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా బెట్టింగ్ లు వేస్తున్నారు. విజయవాడలో పీవీపీ వర్సెస్ కేశినేని నాని, గుంటూరులో గల్లా జయదేవ్ గెలుపుపై, విశాఖ నార్త్ లో గంటా శ్రీనివాస్ రావు, ఇక గుంటూరు జిల్లాలోని మైలవరంలో పోటీచేసిన దేవినేని ఉమా, కొడాలి నానిపై పోటీచేసి దేవినేని అవినాష్ ఇలా ఈ స్థానాల్లో ఏపీలో జోరుగా బెట్టింగ్ జరుతోంది.

పోలింగ్ కు ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ప్రస్తుతం ఏపీ కేంద్రంగా బెట్టింగ్ జోరందుకుంది. రేపు ఫలితాలు వెలువడే వరకూ కూడా ఈ బెట్టింగ్ ఉదృతంగా సాగే అవకాశాలున్నాయి.