Telugu Global
Health & Life Style

క్యారెట్ కళ్లకే కాదు... మెదడుకూ పదును

కళ్లకు కాటుకే కాదు క్యారెట్ కూడా ఎంతో మేలు చేస్తుంది. కూర తియ్యగా ఉంటే చాలా మంది ఇష్టపడతారు. అలాంటి తియ్యటి కూరే క్యారెట్. క్యారెట్ ను నేరుగా తింటేనే రుచిగా ఉంటుంది. కూరకంటే కూడా సలాడ్… జ్యూస్, క్యారెట్ సూప్, క్యారెట్ హల్వా లా తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే క్యారెట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది అనేక రుగ్మతలను నివారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు… అవి ఏమిటో చూద్దాం. మెదడుకు పదును […]

క్యారెట్ కళ్లకే కాదు... మెదడుకూ పదును
X

కళ్లకు కాటుకే కాదు క్యారెట్ కూడా ఎంతో మేలు చేస్తుంది. కూర తియ్యగా ఉంటే చాలా మంది ఇష్టపడతారు. అలాంటి తియ్యటి కూరే క్యారెట్. క్యారెట్ ను నేరుగా తింటేనే రుచిగా ఉంటుంది.

కూరకంటే కూడా సలాడ్… జ్యూస్, క్యారెట్ సూప్, క్యారెట్ హల్వా లా తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే క్యారెట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది అనేక రుగ్మతలను నివారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు… అవి ఏమిటో చూద్దాం.

  • మెదడుకు పదును పెట్టడంలో క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్ మెదడును ఉత్తేజపరచడమే కాక… శరీరానికి ఉత్తేజం, మంచి ఉల్లాసం కూడా కలిగిస్తుంది.
  • క్యారెట్ దృష్టి లోపాలను నివారిస్తుంది. క్యారెట్ ను తరచూ ఏదో రూపంలో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. అంతే కాదు రేచీకటి వంటి సమస్యలు రావు. చిన్నపిల్లలకు తరచూ క్యారెట్ జ్యూస్ ఇస్తే చాలా మంచిది.
  • క్యారెట్ లో ఉన్న విటమిన్ ఎ సంతాన సాఫల్యతను పెంచుతుంది. క్యారెట్ జ్యూస్ ప్రతిరోజూ తీసుకుంటే ఎంతో మంచిది.
  • స్త్రీలలో ఉన్న రుతుక్రమ సమస్యలను క్రమబద్దీకరించి, స్త్రీల సమస్యలను నివారిస్తుంది.
  • అనేక చర్మ సమస్యలను క్యారెట్ చెక్ పెడుతుంది. చర్మానికి మంచి నిగారింపునివ్వడమే కాకుండా వయసును నిలువరిస్తుంది.
  • క్యారెట్ లో విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. బీపీ, గుండె జబ్బులను నివారించవచ్చును.
  • క్యారెట్ లో అటు విటమిన్లు, ఇటు ఖనిజాలు కూడా సరిసమానంగా ఉన్నాయి. కాబట్టి ఇది సమతుల్యమైన ఆహారంగా వైద్యులు పేర్కొంటున్నారు.
  • క్యారెట్ లో ఉన్న క్యాల్షియం పళ్లకు, ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తుంది.
  • తరచు నోటి పూతతో బాధపడేవారు క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే ఈ సమస్య మళ్లీ.. మళ్లీ రాకుండా నివారించవచ్చు.
  • రక్తహీనతకు క్యారెట్ దివ్యౌషధం. ఈ సమస్యతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా కొన్నిరోజుల పాటు క్యారెట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • నిద్రలేమికి కూడా క్యారెట్ జ్యూస్ మంచి ఔషధం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు క్యారెట్ జ్యూస్ తాగితే మంచి నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
  • మలబద్దకంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగితే కడుపు శుభ్రపడుతుంది. కడుపులో ఉన్న నులిపురుగులు బయటకి పంపడంలో క్యారెట్ జ్యూస్ దోహదపడుతుంది.
  • శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్దాయిలను అదుపు చేస్తుంది. అందువల్ల గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చును.
  • శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో క్యారెట్ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది.
  • మూత్రపిండాలను శుభ్రపరచి మలినాలను బయటకి పంపడంలోనూ క్యారెట్ జ్యూస్ దోహదపడుతుంది.
  • జుట్టు కుదుళ్లను గట్టి పరచి వత్తుగా పెరగాలంటే ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవాల్సిందే.
  • ఇంకా క్యారెట్ లో అనేక ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు, మెగ్నీషియం, సోడియం, మాంగీనీస్, అయోడిన్, పొటాషియం వంటి అనేక గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడ శరీరం సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
First Published:  21 May 2019 7:02 PM GMT
Next Story