Telugu Global
NEWS

ఇంగ్లండ్ గడ్డపై ఐదోసారి వన్డే ప్రపంచకప్

46 రోజులు…11 వేదికలు…48 మ్యాచ్ లు మే 30 నుంచి జులై 14 వరకూ 2019 ప్రపంచకప్  క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జులై 14న టైటిల్ సమరం ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో ఐదోసారి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వడానికి …క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ ముస్తాబయ్యింది. మే 30నుంచి జులై 14 వరకూ 46 రోజులపాటు సాగే 48 మ్యాచ్ ల ఈ సమరం కోసం 10 దేశాల జట్లు సై అంటున్నాయి. అంతేకాదు… ఇంగ్లండ్ […]

ఇంగ్లండ్ గడ్డపై ఐదోసారి వన్డే ప్రపంచకప్
X
  • 46 రోజులు…11 వేదికలు…48 మ్యాచ్ లు
  • మే 30 నుంచి జులై 14 వరకూ 2019 ప్రపంచకప్
  • క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జులై 14న టైటిల్ సమరం

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో ఐదోసారి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వడానికి …క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ ముస్తాబయ్యింది.

మే 30నుంచి జులై 14 వరకూ 46 రోజులపాటు సాగే 48 మ్యాచ్ ల ఈ సమరం కోసం 10 దేశాల జట్లు సై అంటున్నాయి. అంతేకాదు… ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మొత్తం 11 వేదికలను సిద్ధం చేశారు.

1975, 1979, 1983 ప్రుడెన్షియల్ ప్రపంచకప్ టోర్నీలతో పాటు… 1999 ఐసీసీ ప్రపంచకప్ కు సైతం ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది.

ప్రస్తుత ఐదో ప్రపంచకప్ కోసం… లండన్ లోని క్రికెట్ మక్కా… లార్డ్స్ స్టేడియంతో పాటు ది ఓవల్, బ్రిస్టల్, కార్ఢిఫ్, చెస్టర్ లీ స్ట్రీట్, బర్మింగ్ హామ్, హెడింగ్లే, నాటింగ్ హామ్, ఇతర కౌంటీ గ్రౌండ్స్ సకలహంగులతో ముస్తాబయ్యాయి.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు తన ప్రారంభమ్యాచ్ ను సౌతాప్టన్ లోని హాంప్ షైర్ బౌల్ వేదికగా ఆడనుంది.
జులై 9న మాంచెస్టర్ వేదికగా తొలి సెమీఫైనల్స్, జులై 11న బర్మింగ్ హామ్ వేదికగా రెండో సెమీఫైనల్స్, జులై 14న లార్డ్స్ వేదికగా ఫైనల్స్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.

ఇంగ్లండ్ వేదికగా ఐదోసారి జరుగనున్న ఈ ప్రపంచకప్ లో రికార్డుల మోత మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే చరిత్రలోనే తొలిసారిగా 500 స్కోరు సైతం నమోదు కావచ్చని నిర్వాహక సంఘం అంచనా వేస్తోంది.

తొలిసారిగా 70 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 28 కోట్ల రూపాయల నజరానా ఇవ్వనున్నారు.

గత 11ప్రపంచకప్ టోర్నీలలో …ఆస్ట్రేలియా ఐదుసార్లు, భారత్, విండీస్ చెరో రెండుసార్లు, పాకిస్థాన్, శ్రీలంక చెరోసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

First Published:  21 May 2019 9:12 PM GMT
Next Story