మళ్లీ దిల్ రాజు క్యాంపులో మహేష్ బాబు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే తన కెరీర్ లో 25వ చిత్రమైన ‘మహర్షి’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు  వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 9న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండే మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంది.

దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల సమయంలో ముగ్గురు నిర్మాతల వద్ద మధ్య కొన్ని విభేదాలు కూడా వచ్చాయి.

అయితే అప్పుడే దిల్ రాజు, మహేష్ బాబు 26 సినిమా నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం మహేష్ తదుపరి సినిమాను కూడా దిల్ రాజు నిర్మించబోతున్నాడట.

ఈ మధ్యనే ‘సీత’ సినిమా వేడుకల్లో ఏకే ఎంటర్ టైన్ మెంట్ పతాకం వారు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎలాగో మహేష్ బాబు 27, 28 వ చిత్రాలు నిర్మించడం కుదరదు కాబట్టి 26 చిత్రాన్ని వదులుకునే సాహసం దిల్ రాజు చేయడని తెలుస్తోంది. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.