కాజల్, తమన్నా లనే నమ్ముకున్నారా?

గత కొంతకాలంగా డిజాస్టర్ లతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా ‘సీత’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో కాజల్ పాత్రకు ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. చిత్ర బృందం కూడా కాజల్ తోనే ఎక్కువగా ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తోంది.

మరోవైపు ‘అభినేత్రి 2’ సినిమాకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. హారర్ కామెడీ సినిమాగా ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘అభినేత్రి’ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘అభినేత్రి 2’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ సినిమాలోని ‘రెడీ రెడీ’ పాట ప్రోమో విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్ సాంగ్ ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆ పాటలో తమన్నా తన అందాన్ని ఆరబోస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

చూస్తూ ఉంటే ఈ రెండు సినిమాల దర్శక నిర్మాతలు హీరోయిన్ల పైనే తమ భారం వేశారు అని అర్థం అవుతోంది. మరి ఈ ‘క్వీన్’ హీరోయిన్లు ఈ సినిమాల తో ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి.