ఘనవిజయం దిశగా వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. ఇప్పటివరకూ వెలువడిన ఆధిక్యాల ప్రకారం వైసీపీ 151 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ 23 స్థానాల్లో ముందంజలో ఉంది.

టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీచేసిన కుప్పం నియోజకవర్గంలో 365 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. అలాగే పార్లమెంట్‌ స్థానాల్లో వైసీపీ 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా టీడీపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి వైసీపీ 130 స్థానాలకు పైగానే సాధించే అవకాశం ఉంది. దీంతో జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం అయినట్లే.

నెటిజన్లు మాత్రం లగడపాటితో ఆడుకుంటున్నారు.