చంద్రబాబు రాజీనామా

ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలవడంతో టీడీపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సాయంత్రం రాజీనామా చేయనున్నారు.

ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలలో కన్నా పార్లమెంట్‌ స్థానాల్లో ఘోరాతి ఘోరంగా టీడీపీ ఓడిపోవడం జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు అశినిపాతమే. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబుకు ఫలితాల సరళిని బట్టి చూస్తుంటే…. ఒక్క ఎంపీ సీటు కూడా దక్కే సూచనలు కనబడడం లేదు. చంద్రబాబును గొప్పనాయకుడిగా ఊహించుకుంటున్న జాతీయ నేతలు ఈ ఫలితాలను చూసి కంగుతింటున్నారు.

చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన అనేకమంది మంత్రులు ఓటమిబాటలో ఉన్నారు. చివరకు భవిష్యత్తు నాయకుడిగా కీర్తించబడ్డ లోకేష్‌ కూడా ఓడిపోనుండడం టీడీపీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది.