హమ్మయ్య… మొత్తానికి ఒప్పించాడు

గీతగోవిందం హిట్ తర్వాత ఓ పెద్ద హీరోతో సినిమా చేయాలనేది పరశురాం టార్గెట్. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు ఈ దర్శకుడు. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ నుంచి మొదలుపెట్టి చాలామంది హీరోలకు కథలు వినిపించాడు. ఎట్టకేలకు తను అనుకున్నది సాధించాడు ఈ డైరక్టర్.

అవును.. మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సినిమా రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అదే ఏడాది దసరాకు మూవీ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీతో కొరటాల శివ నిర్మాతగా మారుతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్, కొరటాల కలిసి ఈ సినిమాను నిర్మిస్తారట.

అంతా బాగానే ఉంది కానీ, ఇక్కడో చిన్న మెలిక ఉంది. సందీప్ రెడ్డి వంగ కనుక పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో మహేష్ ను మెప్పిస్తే.. అనీల్ రావిపూడితో సినిమా పూర్తయిన తర్వాత ఇదే ప్రాజెక్టు ఉంటుంది. అప్పుడు పరశురాం సినిమా మరో 6 నెలలు ఆలస్యం అవుతుంది. ఒకవేళ సందీప్ రెడ్డి ఫెయిల్ అయితే మాత్రం పరశురాం ముందుకొస్తాడు. అదీ సంగతి.