మహేష్ ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ రెడీ

మహర్షి సినిమా హిట్ అవ్వడంతో పండగ చేసుకుంటున్నారు మహేష్ అభిమానులు. ఇప్పుడు వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఒకటి రెడీ అయింది. ఆ వార్తను ఈనెల 31న ప్రకటించబోతున్నారు. ఆరోజు కృష్ణ పుట్టినరోజు.

తండ్రి పుట్టినరోజు నాడు తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక విశేషాన్ని బయటపెట్టడం మహేష్ కు అలవాటు. అందుకే ఈసారి కూడా తండ్రి పుట్టినరోజు కోసం ఓ స్పెషల్ న్యూస్ రెడీ చేశాడు ప్రిన్స్.

ఇంతకీ ఆ ప్రత్యేకమైన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా. మహేష్-అనీల్ రావిపూడి సినిమా ఓపెనింగ్. అవును.. ఇప్పటికే పక్కా అయిన ఈ సినిమాకు సంబంధించి లాంఛింగ్ డేట్ ను 31న ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం మహేష్ ఫారిన్ టూర్ లో ఉన్నాడు. ఆ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే అనీల్ రావిపూడి సినిమా ప్రారంభం అవుతుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారు. ఈ వివరాల్ని కూడా 31న ప్రకటించే ఛాన్స్ ఉంది.