వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 150 స్థానాలలో ఆధిక్యత సాధించి అధికారాన్ని చేపట్టబోతున్న వైఎస్ జగన్‌కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్ జగన్.. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏపీలో మీరు సాధించిన ఈ ఘనవిజయం మీ కష్టానికి ఫలితం. ఏపీ ప్రజలు మీ కష్టాన్ని గుర్తించి వారి దీవెనలు అందించారు. మా తోబుట్టువైన ఏపీ రాష్ట్రానికి మీరు అద్భుతమైన పాలన అందించాలని కోరుకుంటున్నానని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.