వైఎస్ జగన్‌కు ట్వీట్ ద్వారా మోడీ, ఫోన్ ద్వారా కేసీఆర్ అభినందనలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీడీపీని చావు దెబ్బ తీసి రికార్డు స్థాయిలో సీట్లను కైవసం చేసుకున్న వైపీసీ అధికారాన్ని చేపట్టబోతోంది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు.

ప్రధాని మోడీ ఏపీలో విజయం సాధించిన జగన్‌కు ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇంగ్లీషులోనే కాక తెలుగులో కూడా ఆయన అభినందించారు. ప్రియమైన వైఎస్ జగన్, ఏపీలో ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు.. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. మీకు శుభాకాంక్షలు అంటూ తెలిపారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైఎస్ జగన్‌ను అభినందించారు. స్వయంగా జగన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఇకపై ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు లేకుండా కలిసి పని చేద్దామని కేసీఆర్ తెలిపినట్లు సమాచారం.