Telugu Global
Health & Life Style

పనీర్.... ఆరోగ్యంతో హుషార్...

పనీర్ ను కాటేజి జున్ను అని కూడా పిలుస్తారు. ఇది పాల విరుగుతో తయారవుతుంది. ఇందులో క్యాల్షియం, విటమిన్స్, ఫాట్స్ ఉన్నాయి. ఇవి అనేక అనారోగ్యాలకు చెక్ పెడుతాయి. ప్రతిరోజూ కాకపోయినా… అప్పుడప్పుడు పనీర్ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పనీర్ పాలతో తయారవుతుంది కాబట్టి క్యాల్షియం అధికంగానే ఉంటుంది. ఇది కండరాలకు, ఎముకలకు, దంతాలకు మంచి బలాన్ని ఇస్తుంది. ఆటలు ఆడే పిల్లలకి పనీర్ ఎంతగానో ఉపయోగపడుతుంది, వారి కండరాలు, ఎముకలు బలంగా ఉండాలంటే పనీర్ […]

పనీర్.... ఆరోగ్యంతో హుషార్...
X

పనీర్ ను కాటేజి జున్ను అని కూడా పిలుస్తారు. ఇది పాల విరుగుతో తయారవుతుంది. ఇందులో క్యాల్షియం, విటమిన్స్, ఫాట్స్ ఉన్నాయి. ఇవి అనేక అనారోగ్యాలకు చెక్ పెడుతాయి. ప్రతిరోజూ కాకపోయినా… అప్పుడప్పుడు పనీర్ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

  • పనీర్ పాలతో తయారవుతుంది కాబట్టి క్యాల్షియం అధికంగానే ఉంటుంది. ఇది కండరాలకు, ఎముకలకు, దంతాలకు మంచి బలాన్ని ఇస్తుంది.
  • ఆటలు ఆడే పిల్లలకి పనీర్ ఎంతగానో ఉపయోగపడుతుంది, వారి కండరాలు, ఎముకలు బలంగా ఉండాలంటే పనీర్ తినాల్సిందే. ప్రతి 100 గ్రాముల పనీర్ లో దాదాపుగా 10 శాతం ప్రోటీన్స్ ఉంటాయి. శాకాహారులు పనీర్ ను తరచూ తింటే మంచిది.
  • పనీర్ లో ఉండే ఫాస్ఫరస్ శరీరంలో జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
  • ఇందులో ఉన్న మెగ్నీషియం మలబద్దకాన్ని నివారించి, మలినాలను బయటకి పంపుతుంది.
  • పనీర్ లో ఉండే పొటాషియం రక్తంలో ఉండే సాల్ట్స్ ను అదుపు చేస్తుంది. దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • పనీర్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది.
  • ఇందులో ఉన్న ఫొలెట్ గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది. కడుపులో ఉన్న పాపాయి ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతుంది.
  • పనీర్ లో ఉన్న బి కాంప్లెక్స్ ఎర్ర రక్తకణాలు తగ్గకుండా కాపాడుతుంది. అంతే కాదు వాటి స్దాయి పడిపోతే వెంటనే రక్తకణాలు పేంచేందుకు తోడ్పడుతుంది.
  • కాటేజీ జున్ను లేదా పనీర్ లో ఉండే మెగ్నీషియం రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ ను అదుపు చేస్తుంది.
  • మెనోపాజ్ సమస్యలతో బాధపడుతున్న వారికి పనీర్ ఎంతో మేలు చేస్తుంది.
First Published:  22 May 2019 7:02 PM GMT
Next Story