రవిప్రకాష్‌ అబద్ధాలకు అలందా ఆన్సర్‌….

తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని, టీవీ9 యాజమాన్యం తనను మోసం చేసిందని…. నాలాంటి నిజాయితీపరుడికి కూడా అన్యాయం జరిగిందని…. జర్నలిజాన్ని ధనిక స్వామ్యం నుంచి కాపాడుకోవాలని…. అనేకానేక నీతి సూక్త ముక్తావళిని వల్లెవేస్తూ వీడియో విడుదల చేసిన రవిప్రకాష్‌ పై టీవీ9 యాజమాన్యం మండిపడింది.

రవిప్రకాష్‌ లాంటి అవినీతిపరుడు నీతులు మాట్లాడడం అసహ్యంగా ఉందని చీదరించుకుంది. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించి…. జర్నలిజం అంటే అక్షరాలను అమ్ముకోవడం, బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు సంపాదించడం…. అనే స్థితికి తీసుకువచ్చిన రవిప్రకాష్‌ కూడా నీతులు చెబుతుంటే సభ్యసమాజం సిగ్గుపడుతోందని అలందా యాజమాన్యం ఈసడించుకుంది….

వాళ్ళ మాటల్లోనే…..