ఈ నెల 30వ తేదీన జగన్ ప్రమాణస్వీకారం?

ఘనవిజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ….. శాసనసభాపక్ష సమావేశం శనివారం నాడు జరగనుంది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎన్నుకోనున్నారు. జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తుందని భావిస్తున్నారు.

ఎవరూ ఊహించని విధంగా పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వైఎస్సార్‌సీపీకి పడ్డాయి. 150కి పైగా సీట్లలో ఘనవిజయం సాధించే దిశగా వైసీపీ దూసుకుపోతోంది.

రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకూ జరిగిన ఎన్నికల్లో 25 సీట్లనూ వైసీపీ గెలుచుకుని రికార్డు సృష్టించబోతోంది. ఈ గెలుపుతో పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ తరువాత మూడవ అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌ సీపీ అవతరించబోతోంది.