Telugu Global
Cinema & Entertainment

'ఆనంద్ దేవరకొండ' అప్పుడే రెండవ సినిమా....

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు తీసిన దర్శకుడు పవన్ సాదినేని… కళ్యాణ్ రామ్ తో ఒక చిత్రం చేయాల్సి ఉంది. కానీ అది చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తుంది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ సాదినేని బంపర్ ఆఫర్ కొట్టాడు. ఇటీవలే పవన్ అల్లు శిరీష్ కొత్త చిత్రం ఏబీసీడీ కి సహాయ సహకారాలు అందించాడు. […]

ఆనంద్ దేవరకొండ అప్పుడే రెండవ సినిమా....
X

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు తీసిన దర్శకుడు పవన్ సాదినేని… కళ్యాణ్ రామ్ తో ఒక చిత్రం చేయాల్సి ఉంది. కానీ అది చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తుంది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ సాదినేని బంపర్ ఆఫర్ కొట్టాడు. ఇటీవలే పవన్ అల్లు శిరీష్ కొత్త చిత్రం ఏబీసీడీ కి సహాయ సహకారాలు అందించాడు. ఈ సినిమా కి మధుర శ్రీధర్ నిర్మాత. పవన్ సాదినేని పనితనం నచ్చి పవన్ తర్వాతి చిత్రాన్ని తన ప్రొడక్షన్ లో చేయాలని నిర్ణయించుకున్నాడట.

దొరసాని సినిమా తో తెరంగేట్రం చేస్తున్న ఆనంద్ దేవరకొండ ఈ సినిమా లో హీరో గా చేయనున్నాడు అని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని టాక్ నడుస్తుంది. ఆనంద్ దేవరకొండ ని ఈ సినిమా తో ఒక స్టైలిష్ రోల్ లో చూపించాలనే తాపత్రయంతో పవన్ సాదినేని ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

First Published:  24 May 2019 12:12 AM GMT
Next Story