Telugu Global
Cinema & Entertainment

'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' చేయనున్న శ్రీనివాస్ రెడ్డి

కమెడియన్ గా, నటుడిగా, హాస్య నటుడిగా శ్రీనివాస్ రెడ్డి ప్రతిభ ఏంటి అనేది చాలా సినిమాల ద్వారా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో టాప్ కమెడియన్ లలో ఒకరిగా ఉన్నాడు.  అయితే ఆ మధ్య హీరో గా కూడా ఎంట్రీ ఇచ్చి పెద్ద విజయాన్ని సాధించిన శ్రీనివాస్ రెడ్డి…. ఇప్పుడు దర్శకుడి గా మారుతున్న విషయం ఇండస్ట్రీ లో ఎంతో ఆసక్తి రేపుతోంది. శ్రీనివాస్ రెడ్డి కామెడీ ని నమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తి. […]

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు చేయనున్న శ్రీనివాస్ రెడ్డి
X

కమెడియన్ గా, నటుడిగా, హాస్య నటుడిగా శ్రీనివాస్ రెడ్డి ప్రతిభ ఏంటి అనేది చాలా సినిమాల ద్వారా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో టాప్ కమెడియన్ లలో ఒకరిగా ఉన్నాడు.

అయితే ఆ మధ్య హీరో గా కూడా ఎంట్రీ ఇచ్చి పెద్ద విజయాన్ని సాధించిన శ్రీనివాస్ రెడ్డి…. ఇప్పుడు దర్శకుడి గా మారుతున్న విషయం ఇండస్ట్రీ లో ఎంతో ఆసక్తి రేపుతోంది.

శ్రీనివాస్ రెడ్డి కామెడీ ని నమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తి. ఆ కామెడీ బాక్ డ్రాప్ లో నే ఇప్పుడు తన తదుపరి చిత్రం ఉండనుంది అని తెలుస్తుంది. దర్శకుడి గా తన మొదటి చిత్ర షూటింగ్ ని విజయవంతం గా పూర్తి చేసి, సినిమా ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కి తీసుకొని వచ్చాడు శ్రీనివాస్ రెడ్డి.

‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తూ’ అనే టైటిల్ తో ఈ సినిమా ని మన ముందుకు తీసుకు రానున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, సినిమా లో నటించడం…. ఈ సినిమాని శ్రీనివాస్ రెడ్డే స్వయంగా నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉన్నాయి.

First Published:  24 May 2019 3:39 AM GMT
Next Story