Telugu Global
National

కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్‌ రెడ్డి ?

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక వేళ ఏదైనా కారణం వల్ల కిషన్‌ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకోలేకపోతే ధర్మపురి అరవింద్‌ కు ఆ అవకాశం దక్కవచ్చు అంటున్నారు. అయితే 1980 నుంచి బీజేపీ నాయకుడిగా ఉన్న కిషన్‌ రెడ్డికి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. రంగారెడ్డి జిల్లా బీజేవైఎం కన్వీనర్‌గా, […]

కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్‌ రెడ్డి ?
X

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక వేళ ఏదైనా కారణం వల్ల కిషన్‌ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకోలేకపోతే ధర్మపురి అరవింద్‌ కు ఆ అవకాశం దక్కవచ్చు అంటున్నారు.

అయితే 1980 నుంచి బీజేపీ నాయకుడిగా ఉన్న కిషన్‌ రెడ్డికి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. రంగారెడ్డి జిల్లా బీజేవైఎం కన్వీనర్‌గా, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా, కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు. 2010లో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు.

2004లో హియాత్ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభాపక్షం నాయకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు.

భారతీయ జనతాపార్టీ తెలంగాణలో పట్టుసాధించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే త్వరలో ఏర్పడబోయే కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆ అవకాశం పార్టీలో ఎంతోకాలం నుంచి పనిచేస్తూ, ప్రజా ప్రతినిధిగా, శాసనసభాపక్ష నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న కిషన్‌ రెడ్డికే దక్కుతుందని భావిస్తున్నారు.

అయితే ధర్మపురి అరవింద్‌కు…. అమిత్‌ షాతో ఉన్న పరిచయం వల్ల అరవింద్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  24 May 2019 7:33 AM GMT
Next Story