ఇక సర్వేలు చేయను…. క్షమించండి

2018 డిసెంబర్‌ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ, 2019 ఏప్రిల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ఎన్నికల్లోనూ ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని లగడపాటి మీడియాకు ఒక ప్రెస్‌ నోట్‌ పంపాడు.

కారణాలు ఏమైనప్పటికీ ప్రజల నాడి పసిగట్టడంలో రెండుసార్లు విఫలమైనందువల్ల భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు.

నా సర్వే ఫలితాల వల్ల ఏ పార్టీలు గానీ, ప్రజలు గానీ నొచ్చుకుని ఉంటే క్షమించండి అంటూ పత్రికా ప్రకటన విడుదల చేశాడు.