బంపర్ ఆఫర్ కొట్టేసిన గీత

గీతగోవిందం సినిమాలో గీత పాత్రలో నటించి, మెప్పించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది రష్మిక. అటు శాండిల్ వుడ్ లో ఆల్రెడీ ఆమెకు పాపులారిటీ ఉంది. ఇక మిగిలింది కోలీవుడ్ మాత్రమే. ఆ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా ఇప్పటికే కార్తి సరసన ఓ సినిమా చేస్తున్న ఈ చిన్నది, తాజాగా మరో బిగ్ ఆఫర్ దక్కించుకుంది.

కోలీవుడ్ లో అడుగుపెట్టాలనుకునే ఏ హీరోయిన్ అయినా విజయ్ సరసన ఒక్కసారైనా నటించాలని కోరుకుంటుంది. ఎందుకంటే విజయ్ సినిమాలో చేస్తే ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుంది కాబట్టి. ఇప్పుడీ ఆఫర్ కు ఒక్క మెట్టు దూరంలో ఉంది రష్మిక. తన 64వ చిత్రంగా లోకేష్ దర్శకత్వంలో విజయ్ చేయబోయే సినిమాలో రష్మికను హీరోయిన్ గా అనుకుంటున్నారు.

ప్రస్తుతానికైతే చర్చలు సాగుతున్నాయి. విజయ్ సినిమా ఆఫర్ ను వదులుకోవడానికి రష్మికకు ఇష్టంలేదు. కాకపోతే ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలకు కాల్షీట్లు కేటాయించేసింది. సో.. విజయ్ సరసన నటించాలంటే ఆమె తెలుగులో ఏదో ఒక సినిమా నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సమస్యను ఆమె ఎలా అధిగమిస్తుందో చూడాలి.