ఫైట్స్ మాత్రమే కాదు, ఈ పాట కూడా హైలెట్ అంట

సాహో సినిమాకు సంబంధించి మేజర్ ఎట్రాక్షన్స్ చెప్పమంటే ఎవరైనా ఫైట్ సీక్వెన్స్ గురించి మాత్రమే చెబుతారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో దుబాయ్ లో తీసిన యాక్షన్ బ్లాక్స్ సాహోకు హైలెట్ గా నిలవబోతున్నాయి. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఓ సాంగ్ కూడా సాహోకు మెయిన్ ఎట్రాక్షన్ కాబోతోందని అంటోంది యూనిట్.

సాహో సినిమాలో ఓ కలర్ ఫుల్ సాంగ్ ఉంది. అది సినిమా సెకండాఫ్ లో వస్తుంది. నిజానికి అదొక పార్టీ సాంగ్. ఇంకా చెప్పాలంటే పబ్ లో నడిచే సాంగ్. ఆ పాటలో ప్రభాస్ కళ్లుచెదిరే స్టెప్స్ వేయబోతున్నాడట. దీనికోసమే దాదాపు 10 రోజులుగా స్పెషల్ స్టెప్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడట.

ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ పబ్ సెట్ నిర్మించారు. త్వరలోనే ఆ సెట్ లో సాంగ్ షూటింగ్ షురూ అవుతుంది. ఏకథాటిగా 5 రోజుల పాటు షూట్ చేసి ఈ సాంగ్ పూర్తిచేయబోతున్నారు. ఈ సెట్ కోసం కూడా అటుఇటుగా 5 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే సాహో బడ్జెట్ అంచనాల్ని దాటేసింది. 150 కోట్ల రూపాయలు అనుకున్న బడ్జెట్ కాస్తా 250 కోట్ల రూపాయలకు చేరింది. రిలీజ్ నాటికి ఈ సినిమా ఏ మార్క్ టచ్ చేస్తుందో చూడాలి.