Telugu Global
NEWS

ఫ్రెంచ్ ఓపెన్ వేదికకు సరికొత్త హంగులు

90 సంవత్సరాల రోలాండ్ గారోస్ కు న్యూలుక్  2019 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి పారిస్ లో కౌంట్ డౌన్ రోలాండ్ గారోస్ అనగానే…గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఏకైక క్లేకోర్టు టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మాత్రమే గుర్తుకు వస్తుంది. గత 90 సంవత్సరాలుగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి వేదికగా ఉంటూ వస్తున్న పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియం సరికొత్త హంగులతో ముస్తాబై…. 2019 టోర్నీకి ఆతిథ్య మివ్వడానికి సిద్ధమయ్యింది. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల్లో…వింబుల్డన్ టోర్నీని పచ్చిక కోర్టుల్లో, […]

ఫ్రెంచ్ ఓపెన్ వేదికకు సరికొత్త హంగులు
X
  • 90 సంవత్సరాల రోలాండ్ గారోస్ కు న్యూలుక్
  • 2019 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి పారిస్ లో కౌంట్ డౌన్

రోలాండ్ గారోస్ అనగానే…గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఏకైక క్లేకోర్టు టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మాత్రమే గుర్తుకు వస్తుంది. గత 90 సంవత్సరాలుగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి వేదికగా ఉంటూ వస్తున్న పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియం సరికొత్త హంగులతో ముస్తాబై…. 2019 టోర్నీకి ఆతిథ్య మివ్వడానికి సిద్ధమయ్యింది.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల్లో…వింబుల్డన్ టోర్నీని పచ్చిక కోర్టుల్లో, ఆస్ట్రేలియన్, యూఎస్ టోర్నీలను సింథటిక్ సూపర్ టర్ఫ్ లపై నిర్వహిస్తే… ఫ్రెంచ్ ఓపెన్ ను మాత్రం సహజసిద్ధమైన ఎర్రమట్టి కోర్టుల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

గత తొమ్మిది దశాబ్దాల కాలంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి… పారిస్ నగరంలోని రోలాండ్ గారోస్ స్టేడియం వేదికగా ఉంటూ వస్తోంది.

కోర్టు ఫిలిప్పీ చాట్రియర్ సెంటర్ స్టేడియంతో పాటు… సుజానే లెంగ్లిన్ కోర్టు లో సైతం సమూలంగా మార్పులు చేశారు.

9 దశాబ్దాల తర్వాత మార్పులు ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ స్టేడియాలు మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీని ఉపయోగించుకొని…వేదికలను సరికొత్త హంగులతో ముస్తాబు చేసుకొంటూ వస్తుంటే…ఫ్రెంచ్ ఓపెన్ వేదిక రోలాండ్ గారోస్ మాత్రం..న్యాయపరమైన చిక్కులు, కోర్టు తగాదాలతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటూ వస్తోంది. మ్యాచ్ లు జరిగే సమయంలో వర్షం వస్తే… పోటీలను వాయిదా వేసుకొనే పరిస్థితి ఉంది.

అదే మిగిలిన మూడు గ్రాండ్ స్లామ్ వేదికల్లో మాత్రం… కుండపోతగా వర్షం పడినా మ్యాచ్ లను వాయిదా వేయకుండా నిర్వహించుకొనే హంగులను సమకూర్చుకోగలిగాయి.

350 మిలియన్ యూరోల బడ్జెట్ తో…

న్యాయపరమైన చిక్కులు తొలగించుకోడం ద్వారా…రోలాండ్ గారోస్ పునర్నిర్మాణానికి నడుంబిగించారు. మొత్తం 350 మిలియన్ యూరోల భారీబడ్జెట్ తో ఆధునీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ముగిసిన వెంటనే …19వ దశాబ్దంలో నిర్మించిన రోలాండ్ గారోస్ స్టేడియాన్ని కూలగొట్టి సరికొత్త హంగులతో నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన స్టేడియాన్ని మరింతగా విస్తరించారు. సీటింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ డిజైన్ చేశారు. దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన ఆకుపచ్చని రంగుతో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కుర్చీల స్థానంలో చెక్క సీట్లను ఉంచారు.

రూఫ్ టాప్ సదుపాయం…

వర్షం వచ్చినా..మ్యాచ్ ను నిలిపివేయకుండా నిర్వహించుకోడానికి వీలుగా..రూఫ్ టాప్ సదుపాయం కల్పించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడు, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లో రెండేసి కోర్టులకు రూఫ్ టాప్ సదుపాయం ఉంది. ఇప్పుడు సరికొత్తగా ఫ్రెంచ్ ఓపెన్ లో సైతం రూఫ్ టాప్ కోర్టును సమకూర్చుకోగలిగింది.

నిర్మాణానికి మొత్తం 3వేల 700 టన్నుల పలురకాల లోహాలను ఉపయోగించినట్లు…ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహక సంఘం చైర్మన్ జీన్ ఫ్రాంకోయిస్ ప్రకటించారు.

మొత్తం మీద..మే 26 నుంచి జూన్‌ 9 వరకూ జరిగే 2019 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ…సరికొత్తగా నిర్మించిన వేదికలో జరుగనుండటం విశేషం.

First Published:  23 May 2019 11:25 PM GMT
Next Story