మళ్ళీ సిక్స్ పాక్ బాట పట్టిన సుధీర్

సుధీర్ బాబు ప్రస్తుత తెలుగు సినిమా పరిశ్రమ లో టాలెంటెడ్ నటుల్లో ఒకరు. ఆయన మొదటి చిత్రం నుండి ఇప్పటి దాకా ప్రతీ చిత్రం లో ఎంతో కొంత వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ వచ్చాడు.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈయన బాలీవుడ్ లో కూడా పేరున్న నటుడు. భాగీ సినిమా తో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి తన సత్తా ఏంటో చూపెట్టాడు. ముందు నుంచి ఫిట్నెస్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టిన ఈ నటుడు ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో ‘V’ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో నాని, అదితి రావ్, మరియు నివేతా థామస్ కూడా నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం సుధీర్ ప్రస్తుతం సిక్స్ పాక్ శరీరం తో కనిపించనున్నాడు. ఇప్పటికే జిమ్ లో ఫుల్ గా కసరత్తులు చేస్తూ వచ్చిన సుధీర్ తను అనుకున్న బాడీ ని అచీవ్ చేసాడు. సుధీర్ బాబు ఇంతకు ముందు కూడా ఇలా సిక్స్ పాక్ తో వచ్చాడు.  ఇప్పుడు ఇది రెండో సారి. మార్చి లో 76 కిలోలు ఉన్న సుధీర్ ఇప్పుడు 9 కిలోలు తగ్గి 68 కిలోల వరకు ఉన్నాడట. త్వరలో ఈ సినిమా కి సంబందించిన షూట్ మొదలు కానుంది.