ఈసారి తమన్నా దెయ్యం కాదు

తమన్నా దెయ్యంగా మారితే ఎలా ఉంటుందో అభినేత్రి సినిమాలో చూశాం. రెండు విలక్షణమైన పాత్రల్లో తమన్న ఆ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరి ఇప్పుడు రాబోతున్న అభినేత్రి-2 పరిస్థితేంటి? ఇందులో తమన్న దెయ్యంగా నటించిందా? స్పెషాలిటీ ఏంటి అంటూ చర్చ జరిగుతోంది.

అయితే అంతా అనుకుంటున్నట్టు అభినేత్రి-2లో తమన్న దెయ్యం కాదు. ఈసారి ఆ అవకాశాన్ని ప్రభుదేవా దక్కించుకున్నాడు. ఫస్ట్ పార్ట్ లో తమన్న టార్చర్ కు ప్రభుదేవా ఇబ్బంది పడితే, ఈ రెండో భాగంలో ప్రభుదేవా టార్చర్ కు తమన్నాకు చుక్కలు కనిపిస్తాయ. మొత్తమ్మీద కంప్లీట్ హారర్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది అభినేత్రి-2.

కేఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 31న విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్నాడు. హీరోయిన్ నందిత శ్వేత ఓ కీలక పాత్రలో కనిపించనుంది.