జబర్దస్త్ లో సంఘవి…. తీసుకోవడానికి కారణం ఇదేనా?

జబర్దస్త్ ప్రోగ్రామ్ ఈ మధ్య కాలం లో తెలుగు బుల్లి తెర పై వస్తున్న షో లన్నిటిలో టాప్ షో గా నిలిచింది. తెలుగు లో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది.

ఈ షో లో ఇప్పటి వరకు వచ్చిన పార్టిసిపెంట్స్ దాదాపు అందరూ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అంతే కాకుండా ఈ షో కి జడ్జిలుగా చేసిన నాగ బాబు, రోజా లు కూడా జనాలను బాగా ఎంటర్ టైన్ చేశారు.

అయితే ఇప్పుడు రోజా ఈ షో నుండి వైదొలగబోతోందని తెలుస్తుంది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు రోజా మరియు నాగ బాబు కొన్ని రోజులు ఈ షో కి దూరం గా ఉన్నారు. వారి ప్లేస్ లో అప్పుడు కొత్త వారిని తీసుకున్న షో నిర్వాహకులు ఇప్పుడు రోజా కి రీ ప్లేస్ మెంట్ ని ఆలోచించారట.

ఇప్పటికే షో లో కొన్ని ఎపిసోడ్స్ కి వచ్చిన సంఘవి రోజా ప్లేస్ లో ఇక పై న్యాయ నిర్ణేత గా వ్యవహరించనుంది అని తెలుస్తుంది. ఇక కొద్ది రోజులు మీనా కూడా ఈ షో లో పాల్గొనగా, ఆలీ కూడా షో లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో సారి ఎమ్మెల్యే గా గెలవడం, తమ ప్రభుత్వం అధికారం లోకి రావడంతో రోజా జబర్దస్త్ ని వదులుకోబోతుందని చెబుతున్నారు.